మహాత్మాగాంధీ యూనివర్సిటీకి రెండవసారి ఐఎస్ఒ గుర్తింపు
నల్గొండ (CLiC2NEWS): జిల్లాలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీకి రెండవసారి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (ఐఎస్ ఒ) గుర్తింపు లభించింది. ఐఎస్ ఒ సంస్థ ప్రతినిధి ఆలపాటి శివయ్య ఎమ్‌జియు ప్రొఫెసర్ సిహెచ్ గోపాల రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యనందించడంతో ఈగుర్తుంపు లభించిందని తెలిపారు.
