ఎపి ఎక్స్‌ప్రెస్ బోగీలో పొగలు..
వరంగల్ (CLiC2NEWS): వఇవిశాఖపట్టణం నుండి ఢిల్లీ వెళ్లే ఎపి ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో పొగలు వచ్చాయి. రైల్వే సిబ్బంది వెంటనే స్పందించటం వలన ప్రమాదం తప్పింది. వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వేస్టేషన్ వద్ద ఎపి ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతికలోపం కారణంగా పొగలు వచ్చినట్లు రైల్వే సిబ్బంది గుర్తించారు. మంటలు వ్యాపించకుండా రైల్వే సిబ్బంది పొగలను అదుపులోకి తెచ్చారు. రైలులోని ప్రయాణికులందరూ అందోళనకు గురైనారు. ట్రైన్ నెక్కొండ స్టేషన్‌లో అరగంట పాటు నిలిచిపోయింది. సాంకేతిక లోపం సరిచేసిన అనంతరం ట్రైన్ యథావిధిగా బయల్దేరి వెళ్లింది.