ఎపిలో 13,212 పాజిటివ్ కేసులు
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 24 గంటల్లో44,546 మందికి కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 13,212మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్థారణయ్యింది. ఒక్కరోజులో ఐదుగురు ఈ వైరస్‌తో మరణించారు. ఇక గడిచిన 24 గంటల్లో ఈవైరస్ నుండి 2,942 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 64,136 యాక్టివ్ కేసులున్నాయి. ఈమేరకు వైద్యారోగ్య శాఖ బుటిటెన్ విడుదలచేసింది. అత్యధికంగా విశాఖజిల్లాలో 2,244 కేసులు, చిత్తూరు జిల్లాలో 1,585 కేసులు అనంతపురంలో 1,235,శ్రీకాకుళం జిల్లాలో 1,230 కేసులు నమోదయ్యాయి.