క్రీడా పాఠ‌శాల‌లో ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌..

హైద‌రాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలోని వివిధ క్రీడా పాఠ‌శాల‌ల్లో 4,5 త‌ర‌గ‌తుల‌ ప్ర‌వేశాలకు ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈమేర‌కు క్రీడా, ప‌ర్యాట‌క శాఖామంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ ఆదివారం నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు. తెలంగాణ రాష్ట్రంలో హ‌కీం పేట‌, క‌రీంన‌గ‌ర్‌, ఆదిలాబాద్ ల‌లో క్రీడా పాఠ‌శాల‌లు ఉన్నాయి. క‌రోనా కార‌ణంగా 2021-22 విద్యా సంవ‌త్స‌రంలో 4వ త‌ర‌గ‌తిలో ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌లేద‌ని, ఈ సంవ‌త్సరం 4,5 త‌ర‌గ‌తుల్లో 15 క్రీడా విభాగాల్లో 240 సీట్ల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఆర్హ‌లైన విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని మంత్రి సూచించారు.

Leave A Reply

Your email address will not be published.