పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో టిఆర్ ఎస్ ఎంపీల నిర‌స‌న‌

న్యూఢిల్లీ (CLiC2NEWS): పార్లమెంట్ వేదికగా తెలంగాణపై మోడీ అహంకారపూరితమైన మాటలకి వ్యతిరేకంగా పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లోని గాంధీ విగ్ర‌హం వ‌ద్ద టిఆర్ ఎస్ ఎంపీలు నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఈ నిర‌స‌న‌లో టిఆర్ ఎస్ పార్టీకి చెందిన లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ స‌భ్యులు పాల్గొన్నారు.

“ప్ర‌ధాని మోడీ వ్యాఖ్య‌ల‌న ఖండిస్తున్నాం.. జై తెలంగాణ“ అంటూ ఎంపీలు నినాదాలు చేశారు.

ఈ సంద‌ర్భంగా మీడియాతో ఎంపీలు మాట్లాడారు. .. ఎంపీ కేశ‌వ‌రావు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభ‌జ‌న బిల్లుకు బిజెపి మ‌ద్ద‌తు ఇచ్చింద‌ని.. అధికార‌, విప‌క్ష పార్టీలు బిల్లుకు మ‌ద్దతు ఇచ్చిన‌ప్పుడు సంఖ్యాబ‌లం స‌మ‌స్య ఉత్ప‌న్నం కాద‌ని చెప్పారు. లోక్‌స‌భ‌లో 2/3 వంతు మెజార్టీ చూసిన త‌ర్వాతే బిల్లు ఆమోదం పొందిన‌ట్లు స్పీక‌ర్ ప్ర‌క‌టించార‌న్నారు. అన్ని పార్టీలు మ‌ద్దతు ఇచ్చిన బిల్లు అశాస్త్రీయం ఎలా అవుతుంద‌ని కెకె ప్ర‌శ్నించారు. బిల్లు ఆమోదంలో అశాస్త్రీయం ఎముందో భార‌తీయ జ‌న‌తా పార్టీ చెప్పాల‌ని కెకె నిల‌దీశారు. ఈ మీడియా స‌మావేశంలో ఎంపీలు నామా నాగేశ్వ‌ర‌రావు, క‌విత‌, రంజిత్‌రెడ్డి త‌దిత‌ర ఎంపీలు ఉన్నారు. పార్ల‌మెంటు సాక్షిగా ఏర్పాటైన రాష్ట్రంపై మోడీ వ్యాఖ్య‌లు స‌రికావ‌ని ఎంపీలు అన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.