రైలు ఢీకొని ఇద్ద‌రు బిడ్డ‌లు స‌హా త‌ల్లి మృతి

చిన‌గంజాం (CLiC2NEWS): ప్ర‌కాశం జిల్లాలో రైలు కింద‌ప‌డి ఓత‌ల్లి త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌తో స‌హా అత్మ‌హ‌త్య చేసుకుంది. జిల్లాలోని చిన‌గంజాం మండ‌లం సోపిరా రైల్వేగేటు వ‌ద్ద గుర్తుతెలియ‌ని మ‌హిళ త‌న బిడ్డ‌ల‌తో రైలుకు ఎదురెల్లి ప‌ట్టాల మ‌ధ్య‌లో నిల్చొంది. ఇది గ‌మ‌నించిన గేట్‌మ్యాన్‌, స్థానికులు కేక‌లు వేసి, ప‌క్క‌కు వెళ్ల‌మ‌ని చెప్పినా వినిపించుకోలేదు. అటుగా వ‌స్తున్న రైలు ఢీకొన‌డంతో ముగ్గురు అక్క‌డికక్క‌డే మృతిచెందార‌ని పోలీసులు వెల్ల‌డించారు. పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించినా ఎవ‌ర‌న్న‌ది ఆధారాలు తెలియ‌లేదు.

Leave A Reply

Your email address will not be published.