నదుల అనుసంధానం అంశంపై 18న భేటీ.. 4 రాష్ట్రాలకు కేంద్రం పిలుపు
ఈ నెల 18 వతేదీన గోదావరి-కావేరి నదుల అనుసంధానం పాజెక్టుపై చర్చించేందుకు 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంకుచెందిన జల వనరుశాఖ, కేంద్ర జలశక్తి శాఖ సమావేశం కానుంది. ఈ మేరకు చర్చలకు హాజరు కావాలని రాష్ట్రాల జనవనరుల శాఖ కార్యదర్శులకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరికి ఆదేశాలు జారీ అయ్యాయి. జాతీయనీటి అభివృద్ధి సంస్థ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది.