ట్రైనింగ్ చాపర్ కూలి పైలట్ మృతి..
నల్గొండ (CLiC2NEWS): జిల్లాలో ట్రైనింగ్ చాపర్ కూలిపోయి మహిళా శిక్షణ పైలెట్ మృతిచెందారు. పెదపూర మండలం తుంగతుర్తి సమీపంలో రామన్నగూడెం వద్ద సింగిల్ సీటర్ చాపర్ ప్రమదానికి గురైంది. మృతిచెందిన శిక్షణ పైలట్ తమిళనాడుకు చెందిన మహిమగా గుర్తించామని ఎస్పి రెమా రాజేశ్వరి తెలిపారు. ఈ చాపర్ నాగార్జున సాగర్లోని విజయపురిసౌత్ ఏవియేషన్ అకాడమీకి చెందినదని ఆమె వెల్లడించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న అకాడమీ అధికారులు, సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. చాపర్ కూలిపోయిన ప్రదేశానికి సమీపంలోనే 133 కివి హైటెన్షన్ విద్యుత్ తీగులున్నాయి. ఈ చాపర్ తీగలపై కూలి ఉంటే ప్రమాదం మరింత తీవ్రంగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు.