ర‌ష్యాకు శాంసంగ్ ఉత్ప‌త్తుల స‌రఫ‌రా నిలిపివేత‌..!

ఉక్రెయిన్‌కు 6 మిలియ‌న్ డాల‌ర్ల ఆర్ధిక సాయం

వాషింగ్ట‌న్ (CLiC2NEWS): ఉక్రెయిన్‌లో ర‌ష్యా దాడుల‌ను నిర‌సిస్తూ శాంసంగ్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే యాపిల్‌, మైక్రోసాప్ట్ సంస్థ‌ల సైతం ర‌ష్యాలో త‌మ ఉత్ప‌త్తుల విక్ర‌యాల‌ను నిలిపివేశాయి. రాష్యా దాడుల వ‌ల్ల ప్ర‌భావితం అవుతున్న ప్ర‌తి ఒక్క‌రి గురించి తాము ఆందోళ‌న చెందుతున్నామ‌ని తెలిపింది. త‌మ ఉద్యోగులు, వారి కుటుంబాల భ‌ద్ర‌తే ప్ర‌స్తుతం త‌మ ప్ర‌థ‌మ క‌ర్త‌వ్య‌మ‌ని పేర్కొంది. ఆదేవిధంగా ఉక్రెయిన్‌కు 6 మిలియ‌న్ డాల‌ర్ల ఆర్ధిక సాయాన్ని శాంసంగ్ ప్ర‌క‌టించింది.

Leave A Reply

Your email address will not be published.