మరో 13 విమానాల్లో 2500 మంది భారతీయులను తరలించేందుకు చర్యలు..
ఢిల్లి (CLiC2NEWS):ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల్ని తరలించేందుకు కేంద్రం చర్యలు కొనసాగిస్తోంది. అపరేషన్ గంగ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే వేలాది మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చారు. తాజాగా 2500 మంది భారతీయులను 13 విమానాలలో స్వదేశానికి తీసుకొస్తున్నట్లు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ ట్విటర్ వేదికగా వెల్లడించారు.
ఉక్రెయిన్ లో మళ్లీ కాల్పులు మొదలయ్యాయి. పౌరుల తరలింపు కోసం రష్యా సేనలు కాల్పుల విరమణ ప్రకటించిన విషయం తెలిసినదే. అయితే మళ్లీ ఉక్రెయిన్‌లోని మరియుపోల్‌లో రష్యా బలగాలు కాల్పులు కొనసాగిస్తున్నాయి.