India corona: ఐదున్న‌ర వేల‌కు కేసులు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో క‌రోనా కేసుల సంఖ్య భారీగా త‌గ్గుముఖం ప‌డుతోంది. థ‌ర్డ్ వేవ్ అనంత‌రం రేండేళ్ల క‌నిష్టానికి కేసుల సంఖ్య చేరింది. రోజురోజుకి కేసుల సంఖ్య త‌గ్గుతూ వ‌స్తోంది. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశంలో క‌రోనా కేసులు 6 వేల‌కు దిగువ‌కు న‌మోద‌య్యాయి. 24 గంట‌ల్లో 9,09,985 మందికి క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు జ‌రుప‌గా 5,476 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. కొత్త‌గా ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా 158 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేర‌కు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఉద‌యం క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది.

గ‌త కొన్ని రోజుల కంటే క‌రోనా నుంచి కోలుకున్న వారే ఎక్కువ‌గా ఉండ‌టం సానుకూలాంశం. నిన్న ఒక్క రోజే 9754 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 4.23 కోట్ల మంది క‌రోనా ను జ‌యించారు.

ప్ర‌స్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 59,442కి చేరింది.

Leave A Reply

Your email address will not be published.