ఉక్రెయిన్ నుండి 16 వేల మంది స్వదేశానికి..
ఉక్రెయిన్‌లో చిక్కుకన్న భారతీయులను ఇప్పటివరకు దాదాపు 16 వేల మందిని స్వదేశానికి సురక్షితంగా తరలించామని పౌరవిమానయాన శాఖ వెల్లడించింది. భారతీయులను తరలించేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన ‘అపరేషన్ గంగ’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం 11 విమానాల్లో 2135 మంది భారత్ చేరుకున్నట్లు తెలిపింది. మరో ఎనిమిది విమానాలు సోమవారం ఇండియాకు చేరుకోనున్నట్లు.. వాటిలో 1500 మందికి పైగా భారతీయులు స్వదేశానికి రానున్నట్లు తెలిపింది.
ఆపరేషన్ గంగ ద్వారా ఉక్రెయిన్ నుండి ఇప్పటివరకు 15,920 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. రొమేనియా నుండి 6680, పోలండ్ నుండి 2822, హంగేరీ నుండి 5300, స్లొవేకియా నుండి 1118 మంది స్వదేశానికి చేరుకున్నట్లు ట్వీట్ చేశారు.
#OperationGanga Update: We have successfully evacuated over 15920 students via 76 flights. Breakup –
Romania – 6680 (31 flights)
Poland – 2822 (13 flights)
Hungary – 5300 (26 flights)
Slovakia – 1118 (6 flights) @HardeepSPuri @KirenRijiju @Gen_VKSingh— Jyotiraditya M. Scindia (@JM_Scindia) March 6, 2022