పేద విద్యార్థినుల ఉన్నత చదువుల కోసం కెటిఆర్ ఆర్ధిక సాయం..
హైదరాబాద్ (CLiC2NEWS): జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన పేద విద్యార్థుల చదువుకు అయ్యే ఖర్చును భరిస్తానని మంత్రి కెటిఆర్ హామీ ఇచ్చారు. ఉన్నత విద్యను అభ్యసించడం కోసం ఇద్దరు ఒక్కా చెళ్లెళ్లకు మంత్రి ఆర్థిక సాయం అందించారు. తండ్రి కూలీ పని చేస్తున్నాడని తెలుసుకొని.. వారి చదువులు మధ్యలో ఆగి పోకుండా ఉన్నత విద్య పూర్తయ్యేంతవరకు ఖర్ఛు భారస్తానని హామీ ఇచ్చారు.
భూపాలపల్లి జిల్లాకు చెందిన కావేరి, శ్రావణి , ఇద్దరు అక్కాచెల్లెళ్లు. వీరి తండ్రి కూలి పనిచేస్తూ ఇద్దరినీ చదివిస్తున్నాడు. అక్కాచెల్లళ్లిద్దరూ ఇంటర్మీడియట్లో మంచి మార్కులు సంపాదించి.. ఇంజనీరింగ్, మెడికల్ ఉచిత సీట్లు సాధించారు. కానీ మిగతా పరీక్ష, ట్యూషన్ ఫీజులు, హాస్టల్, మెస్ ఫీజులు చెల్లించడం వారికి కష్టంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి వారిద్దరి చదువులకయ్యే ఖర్చు భరిస్తానని హామీ ఇచ్చారు.