పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధని మోడి..
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. సుమారు గంటసేపు ఉక్రెయిన్ అంశంపై సోమవారం ఫోన్‌లో చర్చించారు. రష్యా-ఉక్రెయిన్ ల మధ్య చర్చల స్థితిని పుతిన్ మోడీకి వివరించారు. రెండు దేశాల ప్రతినిధుల మధ్య కొనసాగుతున్న చర్చలతో పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో నేరుగా చర్చలు జరపాలని మోడి.. పుతిన్‌ను కోరారు. సుమీతోపాటు ఉక్రెయిన్‌లోని ఆయా ప్రాంతాల్లో కాల్పుల విరమణ ప్రకటించడం, మానవతా కారిడార్‌ల ఏర్పాటుపై రష్యాను అభినందించారు. ముఖ్యంగా సుమీ నుంచి భారతీయుల తరలింపు అవసరాన్ని ప్రధాని మోడి నొక్కిచెప్పారు. ఈ విషయమై తమవంతు సహకారం అందిస్తామని పుతిన్.. మోడికి హామీ ఇచ్చారు.