‘స్త్రీ మూర్తి’ని స్మరించుకోవడం మనందరి బాధ్యత..
ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల పత్తిపాటి
ఆలేరు (CLiC2NEWS): ఈ లోకంలో స్త్రీ లేకపోతే జననం లేదు. స్త్రీ లేకపోతే గమనం లేదు. స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు. స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు.. అలాంటి మనల్ని కంటిపాపలా కాపాడే ‘స్త్రీమూర్తి’ని స్మరించుకోవడం మన అందరి బాధ్యత అని ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల పత్తిపాటి అన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలకు ప్రభుత్వ విప్ , ఆలేరుఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి పిలుపు మేరకు స్థానికంగా నిర్వహించిన కార్యక్రమంలో మంజుల మాట్లాడుతూ.. తల్లిగా లాలిస్తూ.. చెల్లిగా తోడుంటూ.. భార్యగా బాగోగులు చూస్తూ.. సేవకురాలిలా పనిచేస్తూ.. కుటుంబ భారాన్ని మోస్తూ… సర్వం త్యాగం చేస్తుంది మహిళ. అంతటి గొప్ప మహిళకు మనసారా ధన్యవాదాలు చెప్పుకునే సమయం ఇదే అని అన్నారు. ఈ సందర్భంగా మహిళ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వ్యవస్థాపకురాలు క్లారా జెట్కిన్ కి మహిళలందరి తరపున ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డికి, మహిళందరికీ శుభాకాక్షలు తెలిపారు. తెలంగాణ సిఎం కెసిఆర్‌కు మహిళలందరి తరపున కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో సిఎం మహిళల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారని పేర్కొన్నారు.