దివ్యాంగుడికి మ‌ర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన కోహ్లీ

మొహాలీ (CLiC2NEWS): టీమిండియా మాజీ కెప్టెన్ , భార‌త్ స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీ తాజాగా శ్రీ‌లంక‌తో జ‌రిగిన తొలి టెస్టులో భార‌త్ త‌ర‌ఫున వంద టెస్టులు ఆడిన 12వ ఆట‌గాడిగా అరుదైన మైలురాయిని చేరుకున్నారు. శ్రీ‌లంక‌తో జ‌రిగిన తొలి టెస్టులో టీమిండియా విక్ట‌రీ సాధించిన విష‌యం తెలిసందే. విజ‌యం అనంత‌రం కోహ్లీ త‌న జెర్సీని ఓ దివ్యాంగ అభిమానికి గిఫ్ట్‌గా ఇచ్చాడు. మొహాలీ వేదిక జ‌రిగిన ఈ మ్యాచ్ ఆదివారం ముగిస‌న త‌ర్వాత బ‌స్సు ఎక్కే స‌మ‌యంలో అక్క‌డ ఉన్న అత‌ని అభిమాని ధ‌ర‌మ్ వీర్ పాల్‌కు త‌న జెర్సీని బ‌హుమ‌తిగా ఇచ్చాడు కోహ్లీ. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన విడియో సోష‌ల్‌
మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ప‌లువురు నెటిజ‌న్లు కోహ్లీపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. కోహ్లీ గిఫ్ట్ ఇచ్చిన విష‌యాన్ని ధ‌ర‌మ్ వీర్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో పోస్టు చేశాడు.

 

Leave A Reply

Your email address will not be published.