నెల్లూరు వ‌స్త్ర త‌యారీ కేంద్రంలో అగ్నిప్ర‌మాదం

నెల్లూరు (CLiC2NEWS): జిల్లాలోని లాయ‌ల్ వ‌స్త్ర త‌యారీ ప‌రిశ్ర‌మ‌లో అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. భారీగా ఆస్తి న‌ష్టం సంభ‌వించింద‌ని అధికారులు వెల్ల‌డిస్తున్నారు. నాయుడుపేట మండ‌లం మేన‌కూరు ఇండ‌స్ట్రియ‌ల్ ఎస్టేట్లోనిలాయ‌ల్ టెక్స్‌టైల్స్ ప‌రిశ్ర‌మ‌లో మంట‌లు చెల‌రేగాయి. కార్మికులు ప్ర‌మాదం నుండి బ‌య‌ట‌ప‌డ్డారు. అగ్నిమాప‌క యంత్రాల‌తో మంట‌లు ఆర్పేందుకు చాలా స‌మ‌యం ప‌ట్టింది. దీంతో ప‌రిశ్ర‌మ‌లోని ప‌త్తి గోదాంతోపాటు, వ‌స్త్రాలు నిల్వ‌చేసే గోదాముల్లో మంట‌లు వ్యాపించి భారీగా న‌ష్టం వాటిల్లింది. అగ్నిమాప‌క సిబ్బందితో పాటు పోలీసులు స‌హాయ‌క చ‌ర్యలు చేప‌ట్టారు.

Leave A Reply

Your email address will not be published.