సుల్తాన్‌పూర్‌లో మ‌హిళా పారిశ్రామిక పార్క్‌..

సంగారెడ్డి (CLiC2NEWS): అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్సవాన్ని పుర‌స్క‌రించుకొని సుల్తాన్‌పూర్‌లో మ‌హిళా పారిశ్రామిక పార్క్‌ను రాష్ట్ర ఐటి, ప‌రిశ్ర‌మ‌ల శాఖా మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లాలో 50 ఎక‌రాల్లో ఈ పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా మ‌హిలా పారిశ్రామిక వేత్త‌లు ఏర్పాటు చేసిన ఫ్లో ఇండ‌స్ట్రియ‌ల్ పార్క్ పైలాన్‌ను కెటిఆర్ ఆవిష్క‌రించారు. పారిశ్రామిక పార్కులో త‌మ వ్య‌వ‌స్థాప‌క ప్ర‌యాణాన్ని ప్రారంభించే మ‌హిళా పారిశ్రామికవేత్త‌లంద‌రికీ త‌న అభినంద‌న‌లు తెలిపారు. అనంత‌రం ఫిక్కీ లేడీస్ ఆర్గ‌నైజేష‌న్ (ఫ్లో) పార్క్‌లో మ‌హిళా పారిశ్రామిక వేత్త‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు.

Leave A Reply

Your email address will not be published.