ఉస్మానియాలో అంబరాన్నంటిన సంబరాలు
హైదరాబాద్ (CLiC2NEWS): ఉద్యోగాల భర్తీపై సిఎం కెసిఆర్ ప్రకటన చేసిన నేపథ్యంలో టిఆర్ ఎస్ కార్యకర్తలు, నాయకులు, యువత హర్హం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. టిఆర్ ఎస్ నాయకులు స్వీట్లు పంచుతున్నారు. కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీలో టిఆర్ ఎస్ విద్యార్ధి విభాగం నేతలు కెసిఆర్ ప్లెక్సీకి పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకుంటున్నారు. బాణాసంచా కాలుస్తూ సందడి చేశారు. ఈసంర్భంగా కెసిఆర్ నాయకత్వం వర్ధిల్లాలంటూ నేతలు నినాదాలు చేశారు.
