సుమి నుండి భారతీయుల తరలింపు..
ఢిల్లి (CLiC2NEWS): ఉక్రెయిన్లోని సుమి ప్రాంతంలో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు కేంద్ర విస్తృత చర్యలు చేపట్టింది. సుమినుండి భారతీయులను ప్రత్యేక రైళ్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఉక్రెయిన్లో భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. అక్కడి అధికారుల సహకారంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.
సుమిలో చిక్కుకున్న భారత విద్యార్థుల్ని తరలించేందుకు సహకరించాలని ఉక్రెయిన్, రష్యాకు భారత్ విజ్ఞప్తి చేసింది. ఈ అంశంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఇరు దేశాల అధ్యక్షులతో స్వయంగా మాట్లడిన విషయం తెలిసినదే.
ఉక్రెయిన్ నుండి భారతీయులతో పాటు నేపాల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ పౌరుల్ని కూడ తరలించామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు.