2,56,257 కోట్ల‌తో ఎపి బ‌డ్జెట్

2022-23 బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్టిన ఆర్ధిక‌మంత్రి

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ‌లో బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. ఎపి 2022-23 వార్షిక బ‌డ్జెట్‌ను రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి ప్ర‌వేశ‌పెట్టారు. మొత్తం రూ. 2,56,257 కోట్ల‌తో, బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెడుతున్న‌ట్లు ,చెప్పారు. రెవెన్యూ వ్య‌యం అంచ‌నా రూ. 2,08,261 కోట్లు, మూల‌ధ‌న వ్య‌యం అంచ‌నా రూ. 47,996 కోట్లు, రెవెన్యూ లోటు అంచ‌నా రూ. 17,036 కోట్లు, ద్ర‌వ్య‌లోటు రూ. 48,724 కోట్లుగా పేర్కొన్నారు.

బ‌డ్జెట్ కేటాయింపుల వివ‌రాలు

సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు కోసం:

వైఎస్ ఆర్ రైతుభ‌రోసా – సిఎం కిసాన్ యోజ‌న రూ. 3,900 కోట్లు

వైఎస్ ఆర్ ఉచిత పంట బీమా – రూ. 1802 కోట్లు

వైఎస్ ఆర్ సున్నా వ‌డ్డీ పంట రుణాలు రూ.500 కోట్లు

రైతుభ‌రోసా కేంద్రాల‌కు రూ. 18 కోట్లు
వైఎస్ ఆర్ వ్య‌వ‌సాయ ప‌రీక్ష కేంద్రాలు – రూ. 50 కోట్లు
వైఎస్ ఆర్ ఆరోగ్య ఆస‌రాకు రూ. 300 కోట్లు

వైద్య ఆరోగ్య- కుటుంబ సంక్షేమానికి 15,384 కోట్లు
వైఎస్ ఆర్ ఆస‌రా రూ. 6400 కోట్లు

వైఎస్ ఆర్ సున్న‌వ‌డ్డీరూ. 800 కోట్లు

వైఎస్ ఆర్ చేయూత రూ. 4,235 కోట్లు

జ‌గ‌న‌న్న విద్యాదీవెన రూ. 2500 కోట్లు
జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన రూ. 2083 కోట్లు

జ‌గ‌న‌న్న అమ్మ ఒడి రూ. 6500 కోట్లు

వివిధ రంగాల‌కు

ఎస్సి స‌బ్ ప్లాన్‌కు రూ. 18,518 కోట్లు
ఎస్టి స‌బ్ ప్లాన్‌కు రూ. 6,145 కోట్లు
బిసి స‌బ్ ప్లాన్‌కు రూ. 29,143 కోట్లు
మైనార్టి సంక్షేమానికి రూ. 3,661 కోట్లు
కాపు సంక్షేమానికి రూ. 3,537 కోట్లు

మ‌న‌బ‌డి- నాడు , నేడు రూ. 3500 కోట్లు
పాఠ‌శాల విద్య రూ. 27,706 కోట్లు

ఉన్న‌త విద్య కోసం 2,014 కోట్లు
పేద‌లంద‌రికీ ఇళ్లు రూ.4791 కోట్లు

మ‌హిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ‌కు రూ. 4,322 కోట్లు

వ్య‌వ‌సాయ, మార్కెటింగ్- ధ‌ర‌ల స్థిరీక‌ర‌ణ నిధి – రూ. 500 కోట్లు

ఉచిత‌, రాయితీపై విద్యుత్ స‌ర‌ఫ‌రా రూ. 5000 కోట్లు

ప‌శుసంవ‌ర్థ‌క‌, పాడి, మ‌త్స్య ప‌రిశ్ర‌మ అభివృద్ధికి రూ. 1,568 కోట్లు

హోంశాఖ‌కు రూ. 7,586 కోట్లు

వ్య‌వ‌సాయం అనుబంధ రంగాలు రూ. 13,630.10 కోట్లు

ఇంధ‌న రంగం రూ. 10,281 కోట్లు

జ‌న‌ర‌ల్ ఎకో స‌ర్వీసెస్ రూ. 4,420

ఇండ‌స్ట్రీ అండ్ మిన‌ర‌ల్స్ రూ. 2,755

ఇరిగేష‌న్ ఫ్ల‌డ్ కంట్రోల్ రూ. 11,482

గ్ర‌మీణాభివృద్ధి రూ. 17,109

సైన్స్ అండ్ టెక్నాల‌జీరూ. 11
ట్రాన్స్ పోర్టు రూ. 9,617

 

Leave A Reply

Your email address will not be published.