తెలంగాణ సాహిత్య చరిత్రలో కందికొండ చిరస్థాయిగా నిలుస్తారు. మంత్రి కెటిఆర్
హైదరాబాద్ (CLiC2NEWS): ప్రముఖ కవి, గేయ రచయిత కందికొండ యాదగిరి మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి కెటిఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కందికొండ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన మరణం తెలంగాణకు తీరని లోటు, ఆయన పాటలు తెలంగాణ సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. తెలంగాణ సంస్కీతిని తన సాహిత్యం ద్వారా సామాన్య జనానికి తెలిపారని కెటిఆర్ అన్నారు.
సినీ గేయ రచయిత కందికొండ యాదగిరి అనారోగ్యంతో శనివారం మృతిచెందారు. ఆయన 1300కుపైగా పాటలు రచించారు. మొదటగా జానపద గీతాలు రాసే ఆయన 2001 నుండి చిత్రపరిశ్రమలో తన సేవలందిస్తున్నారు.