రమేష్ ఆస్పత్రిపై ప్రభుత్వం చర్యలు
రమేష్ ఆస్పత్రిపై ప్రభుత్వం చర్యలు
రమేష్ ఆస్పత్రిపై ప్రభుత్వం చర్యలు

విజయవాడ: స్వర్ణ ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన కోవిడ్ ఆస్పత్రి నిర్వహణలో నిర్లక్ష్యంతో పది మంది రోగుల ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన రమేష్ ఆస్పత్రిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా కోవిడ్ కేర్ సెంటర్లను నడుపుతున్నట్లు శుక్రవారం కమిటీ నివేదిక వెల్లడించింది. దీంతో రమేష్ ఆస్పత్రికి అనుమతిచ్చిన కోవిడ్ కేర్ సెంటర్లను జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ రద్దు చేశారు. విజయవాడ ఎంజీ రోడ్‌లోని డాక్టర్ రమేష్ కార్డియాక్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆస్పత్రి మాత్రమే కోవిడ్ రోగుల చికిత్స కోసం గుర్తింపు పొందినట్లు గుర్తించారు.
స్వర్ణ ప్యాలెస్ ప్రమాదంపై ప్రాథమిక నివేదిక.. కీలక విషయాలు
నగరంలోని స్వర్ణ పాలెస్ కోవిడ్ సెంటర్‌లో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనపై జాయింట్ కలెక్టర్ నేతత్వంలో వేసిన కమిటీ ప్రాథమిక నివేదిక వచ్చేసింది. ఈ నివేదికను నిశితంగా పరిశీలించిన అనంతరం రమేష్ ఆస్పత్రికి జగన్ సర్కార్ షాకిచ్చింది!. ఈ క్రమంలో కోవిడ్ కేర్ అందించడంలో కేటగిరి-ఏ ట్రీట్మెంట్ అందించే అసుపత్రిగా ఉన్న రమేష్ ఆసుపత్రి అనుమతులను రద్దు చేస్తూ కష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ఉత్తర్వులు ఇచ్చారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఇవి అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. రమేష్ ఆస్పత్రి నియంత్రణలో ఉన్న ెటల్ స్వర్ణ ప్యాలెస్‌లో ఆగస్టు న అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో నిబంధనలకు వ్యతిరేకంగా కోవిడ్ కేర్ సెంటర్‌ను పెట్టినట్లు తేలింది. అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని వెల్లడైంది. అంతేకాక ఆసుపత్రిలో చేరిన రోగుల నుంచి ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేశారని నివేదిక పేర్కొంది. దీంతో కోవిడ్ కేర్ సెంటర్‌గా రమేష్ ఆసుపత్రికి ఇచ్చిన గుర్తింపు రద్దు చేశామని కలెక్టర్ ఇంతియాజ్ వెల్లడించారు. కరోనా పాజిటివ్ రోగులను చేర్చుకోవద్దని రమేష్ ఆసుపత్రిని ఆదేశించారు. ఈ మేరకు జారీ చేసిన ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. కాగా.. ఈ నివేదికతో పలు కీలక విషయాలు వెలుగు చూశాయి. ెటల్ నిర్వహణలో ఆసుపత్రి యంత్రాంగం అవసరమైన జాగ్రత్తలు తీసుకోలేదని కమిటీ తేల్చింది. అంతేకాదు.. జీవో 77ను అతిక్రమించి ఆసుపత్రి యాజమాన్యం ఫీజులను భారీగా వసూలు చేశారని తేటతెల్లమైంది. ఫైవ్‌మెన్ కమిటీ హాస్పటల్ లో గుర్తించిన లోటుపాట్లను తెలియజేస్తూ కలెక్టర్ ఆసుపత్రికి నోటీసులు జారీ చేశారు. కమిటీ రిపోర్ట్ ఆధారంగా ెటల్‌లో కోవిడ్ కేర్ సెంటర్ నిర్వహణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని కలెక్టర్ తెలిపారు.
నివేదికలోని మరిన్ని కీలకాంశాలు..
‘ప్రభుత్వం ఇచ్చిన జీవో ఎంఎస్ నంబర్-77ను అతిక్రమించి కోవిడ్ బాధితుల నుంచి అధికంగా ఫీజులను వసూలు చేసింది. రూల్-9 ఏపీ అల్లోపతిక్, ప్రైవేట్ మెడికల్ కేర్ రిజిస్ట్రేషన్, రెగ్యులేషన్ రూల్స్‌ను రమేష్ హాస్పిటల్ పట్టించుకోలేదు. ఆసుపత్రి రిసెప్షన్‌లో అందిస్తున్న సేవల రేటు ఇంగ్లీష్‌లోనూ, తెలుగులోనూ ప్రదర్శించాలి. అలాంటి బోర్డును ఏదీ ఆసుపత్రి వద్ద ప్రదర్శించలేదు. మెట్రో పాలిటన్ ెటల్, ఎం- 5 ెటల్‌లో జిల్లా అధికారుల అనుమతి లేకుండా కోవిడ్ కేసులను జాయిన్ చేసుకుంది. డిఎంహెచ్‌వో క్యాంపు ఆఫీస్ వద్ద ఈ నెల 30లోపు కమిటీ గుర్తించిన అంశాలపై లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. వాదనలు వినిపించేందుకు న్యాయవాదిని ఏర్పాటు చేసుకుంటే విచారణకు వారం రోజుల ముందే తెలియజేయాలి. ఆసుపత్రి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌ను విచారణకు వచ్చే ముందు లేదా అదే రోజు తీసుకువచ్చి, స్వాదీనపరచాలి’ అని కమిటీ ఆదేశించింది.