రాష్ట్రంలో 30,453 ఉద్యోగాల భర్తీకి ఆర్ధిక శాఖ అనుమతి
హైదరాబద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి సిఎం కెసిఆర్ చేసిన ప్రకటనకు అనుగుణంగా రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీశ్‌రావు, అధికారులు కసరత్తు పూర్తి చేశారు. సిఎం కెసిఆర్ శాసనసభలో ఉద్యోగాల భర్తీకి కీలక ప్రకటన చేసిన విషయం తెలిసినదే. ఈ నేపథ్యంలో ఈరోజు తొలి విడతగా 30,453 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ప్రక్రియకు సంబంధించి నియామక సంస్థలకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
గ్రూప్-1లో 503 పోస్టుల భర్తీకి పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు అనుమతిస్తూ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. టిఎస్పిఎస్సి తదుపరి ప్రక్రియను కొనసాగించనుంది.
పోలీసు నియామక సంస్థ ద్వారా జైళ్ల శాఖలో 154 పోస్టులు, పోలీసు శాఖలో 16,587 పోస్టులు, టిఎస్పిఎస్సి ద్వారా జైళ్ల శాఖలో 31 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, వైద్యారోగ్య శాఖలో 2,662 పోస్టులు, డిప్యూటి కలెక్టర్ 42 పోస్టులు, డిఎస్పిలు 91 పోస్టులు, ఎంపిడిఓ 121 పోస్టులు, వైద్యారోగ్య వాఖ పాలానాధికారి 20 పోస్టులు, వాణిజ్య పన్ను శాఖలో 48 , అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ 38, అసిసె్టంట్ ఆడిట్ ఆఫీసర్ 40 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటితో పాటు ఉపాధ్యాయ ఆర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది.