ధాన్యాన్ని కొనగోలు చేయాలని ప్రధాని మోడికి సిఎం కెసిఆర్ లేఖ
హైదరాబాద్ (CLiC2NEWS): ధాన్యం సేకరణపై ప్రధాని నరేంద్ర మోడికి ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ రాశారు. రాష్ట్రంలో యాసంగిలో పండిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సిఎం లేఖలో పేర్కొన్నారు. పంజాబ్, హర్యానాలో మాదిరిగానే తెలంగాణలో కూడా ధాన్యాన్ని సేకరించాలని, ఆహార భద్రతా చట్టాన్ని అమలు చేసే బాధ్యత కేంద్రానిదే అని సిఎం స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వ్యవసాయ నిపుణులతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సిఎం కెసిఆర్ లేఖలో కోరారు.