రాడిసన్ బ్లూప్లాజా హోటల్ లైసెన్స్ రద్దు..
హైదరాబాద్ (CLiC2NEWS): బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూప్లాజా హోటల్ పుడింగ్ అండ్ మింక్ పబ్, బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్‌ను ఎక్సైజ్ శాఖ రద్దు చేసింది. పబ్‌లో మాదక ద్రవ్యాలు లభ్యమవటంతో పోలీసులు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసినదే. హోటల్‌లో జరిగిన ఘటనపై ఎక్సైజ్ శాఖ ఉన్నాతాధికారులు సమీక్ష నిర్వహించారు. దీనిపై చర్చించి పబ్, బార్ అండ్ రెస్టారెంట్ నింబంధనలు ఉల్లంఘించినట్లు ఎక్సైజ్ శాఖ తేల్చింది. వివరాలు తెలుసుకున్న రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. వెంటనే లైసెన్స్ రద్దు చేయాల్సిందిగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ ను ఆదేశించారు. దీంతో రెండిటి లైసెన్స్ రద్దు చేసినట్లు ఎక్సైజ్ శాఖ సూపరెంటెండెంట్ శ్రీనివాసరావు వెల్లడించారు.