హీరో ప్రభాస్ కారుకు జరిమానా విధించిన పోలీసులు..
హైదరాబాద్ (CLiC2NEWS): ట్రాఫిక్ పోలీసులు సినీ హీరో ప్రభాస్ కారుకు జరిమానా విధించారు. నగరంలోని జూబ్లిహిల్స్ రోడ్ నంబర్ 36లో నీరుస్ కూడలి వద్ద బ్లాక్ ఫ్రేమ్‌తో వెళ్తున్న కారును పోలీసులు ఆపి పరిశీలించగా.. ఆ కారు ప్రభాస్‌దిగా తేలింది. నంబర్ ప్లేట్ సరిగ్గా లేకపోవడం, ఎంపి స్టిక్కర్, బ్లాక్ ఫ్రేమ్ ఉండటంతో ట్రాఫిక్ పోలీసులు రూ. 1,450 చలానా వేశారు. పోలీసులు జరిమానా విధించారు. ఆ సమయంలో ప్రభాస్ కారులో లేరు. ఇదేవిధంగా గతంలో చాలా మంది నటుల కార్లకు జరిమానా విధించి, వాటికున్న బ్లాక్ ఫ్రేమ్‌లను తొలగించారు.