వైద్యులు లాంగ్ లీవ్ పెడితే..
గుంటూరు (CLiC2NEWS): బోధనాసుపత్రులలో వైద్యులు దీర్ఘకాలిక సెలవులో వెళ్తే విధుల నుంచి తొలగిస్తామని ఎపి వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు స్పష్టం చేశారు. గుంటూరు సర్వజానాసుపత్రిలో రాష్ట్ర వైద్యరోగ్య శాఖ మంత్రి విడదల రజని, ఇతర అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూరాలజి విభాగం అధిపతి ఆచార్య ప్రకాశరావు మాట్లాడుతూ తమ విభాగంలో ఉన్న ఇద్దరు సహాయ ఆచార్యులు ఇటీవల విశాఖపట్నం బదిలీ అయ్యారని, అక్కడి నుండి వచ్చిన ఇద్దరు డాక్టర్లు విధుల్లో చేరి వెంటనే సెలవుపై వెళ్లిపోయారని తెలపారు. దీంతో తాను ఒక్కడినే పేషెంట్లకు సేవలందించడం కష్టంగా ఉందని చెప్పారు.