ప్రేమించ‌ట్లేద‌ని యువ‌తి గొంతు కోసిన ప్రేమోన్మాది!

హ‌నుమ‌కొండ (CLiC2NEWS): హ‌నుమ‌కొండ‌లోని గాంధీన‌గ‌ర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రేమోన్మాది విద్యార్థిని గొంతుకోశాడు. స్థానిక సుబేదారి పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. రంగంపేట మండ‌లం న‌కిరేప‌ల్లికి చెందిన అనుష (23) ఎంసిఎ చ‌దివి ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో గ్రూప్స్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతోంది. సంగెం మండ‌లం మొండ్రాయి కి చెందిన అజార్‌.. ప్రేమ పేరుతో అనూష వెంట ప‌డేవాడు.. అయితే అత‌ని ప్రేమ‌ను ఆమె నిరాక‌రించింది. గ‌త కొంత కాలంగా అనుష‌ను అజార్ వేధింపుల‌కు గురిచేస్తున్నాడు. ఈ క్ర‌మంలో అనూష శుక్ర‌వారం ఉద‌యం వ‌రంగ‌ల్ వ‌చ్చింది. ఇది తెలుసుకున్న అజార్ ఇవాళ ఉద‌యం గాంధీన‌గ‌ర్ చేరుకున్నాడు. ఈ నేప‌థ్యంలో ఇద్ద‌రి మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటుచేసుకుంది. కోపోద్రిక్తుడైన అజార్ క‌త్తితో అనూష గోంతు కోశాడు. ఈ దాడిలో తీవ్ర గాయాల‌పాలైన విద్యార్థినిని స్థానికులు ఎంజిఎం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.