బాధితుడికి 3 తులాల బంగారు గాజుల అప్పగించిన పోలీసులు

పెద్ద‌ప‌ల్లి (CLiC2NEWS): బంగారు గాజుల బ్యాగ్ ఆటోలో మ‌రిచిపోయిన వ్య‌క్తికి పోలీసులు స‌కాలంలో స్పందించి బాధితుడ‌గికి గాజుల బ్యాగ్ అప్ప‌గించారు. గోదావ‌రిఖ‌నికి చెందిన గోల్డ్‌స్మిత్ 3 తులాల బంగారు గాజులు ఉన్న బ్యాగును ఆటోలో మ‌రిచిపోయాడు. అనంత‌రం పోలీసులకు ఫిర్యాదు చేయ‌గా ఎస్ ఐ రాజేష్ వెంట‌నే స్పందించి సిసి పుటేజి ఆధారంగా ఆటో డ్రైవ‌ర్ అడ్ర‌స్ తెలుసుకొన్నారు. ఆటో డ్రైవ‌ర్ గాజుల బ్యాగ్ బాధితుడికి అప్ప‌గించారు. ఈ సంద‌ర్భంగా పోలీసులు ఆటోడ్రైవ‌ర్‌ను అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.