యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న సుప్రీం కోర్టు న్యాయమూర్తి
యాదాద్రి (CLiC2NEWS): యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ దర్శించుకున్నారు. శనివారం ఉదయం కుటుంబ సమేతంగా యాదాద్రి చేరుకున్న జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్‌కు ఆలయ అర్చకులు ఘటన స్వాగతం పలికారు.
స్వామి వారి దర్శనం అనంతరం ప్రధాన అర్చకులు ఆశీర్చనాలు ఇచ్చారు. ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదన్ని అందజేశారు. వారితో పాటు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ కూడా స్వామి వారిని దర్శించుకున్నారు.