నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాలి..

-హోంమంత్రి మ‌హ‌మూద్ అలీ

హైద‌రాబాద్ (CLiC2NEWS): జూబ్లీహిల్స్ బాలిక అత్యాచార ఘ‌ట‌న‌లో నిందితుల‌ను క‌ఠినంగా శిక్షిస్తామ‌ని తెలంగాణ హోంమంత్రి మ‌హ‌మూద్ అలీ స్ప‌ష్టం చేశారు. మోదాతో సంబంధం లేకుండా నిందితుల‌ను శిక్షించాల‌ని మంత్రి కెటిఆర్ చేసిన ట్వీట్‌పై మ‌హ‌మూద్ అలీ స్పందించారు.

నిందితుల‌పై క‌ఠినంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అన్నారు. ఇప్ప‌టికే పోలీసులు ద‌ర్యాప్తు వేగ‌వంతం చేసిన‌ట్లు తెలిపారు. నిందితుల‌ను వీలైనంత త్వ‌ర‌గా అరెస్టుచేయాల‌ని పోలీసులకు ఆదేశాలు ఇచ్చిన‌ట్లు పేర్కొన్నారు. ఎంత‌టివారైనా ఉపేక్షిందిలేద‌ని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.