ఆర్ఆర్‌బి, ఎన్‌టిపిసి ప‌రీక్ష‌ల‌కు ప్ర‌త్యేక రైళ్లు

హైద‌రాబాద్ (CLiC2NEWS): ఆర్ ఆర్ బి ఎన్‌టిపిసి ప‌రీక్ష‌ల‌కు ప్ర‌త్యేక రైళ్లు న‌డ‌ప‌నున్న‌ట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే అధికారులు ప్ర‌క‌టించారు. జూన్ 12, 13, 14 తేదీల్లో జ‌ర‌గ‌నున్న ఆర్ ఆర్ బి ఎన్‌టిపిసి ప‌రీక్షలు నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు పూర్త‌య్యాయి. ఈ నేప‌థ్యంలో ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యే అభ్య‌ర్థుల‌కు ప్ర‌త్యేక రైళ్ల‌ను ఏర్పాటు చేశారు. ఈ అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోవాల‌ని రైల్వే అధికారులు సూచించారు.

శాలిబార్ – సింకింద్రాబాద్‌(08005) ఎక్స్‌ప్రెస్ జూన్ 11వ తేదీ ఉద‌యం 6 గంట‌ల‌కు శాలిమార్ స్టేష‌న్‌లో బ‌య‌లు దేరి, మ‌దుస‌టి రోజు ఉద‌యం 11 గంట‌ల‌కు సికింద్రాబాద్ స్టేష‌న్‌కు చేరుకుంటుంది. సికింద్రాబాద్ – శాలిమార్ (08006) ఎక్స్‌ప్రెస్ జూన్ 14 వ తేదీ మ‌ధ్యాహ్నం 2.30 గంల‌కు బ‌య‌లు దేరుతుంది. ఇది మ‌రుసటి రోజు రాత్రి 9.20 గంట‌ల‌కు శాలిమార్ చేరుకుంటుంది.

ఈ ప్ర‌త్యేక రైళ్లు సంత్ర‌గ‌చ్చి, ఖ‌ర‌గ్‌పూర్‌, బాలా సోర్‌, భ‌ద్ర‌క్‌, జాజ్‌పూర్ కోయింజార్ రోడ్‌, క‌ట‌క్‌, భ‌వ‌నేశ్వ‌ర్‌, ఖుద్రా రోడ్‌, బ్ర‌హ్మ‌పూర్‌, ప‌లాస‌, శ్రీ‌కాకుళం రోడ్‌, విజ‌య‌న‌గ‌రం, విశాఖ ప‌ట్ట‌ణం, రాజ‌మండ్రి, విజ‌య‌వాడ‌, గుంటూరు స్టేష‌న్‌ల‌లో ఆగ‌నున్నాయి.

బిలాస్‌పూర్ – సికింద్రాబాద్ (08819) ఎక్స్‌ప్రెస్ జూన్ 11 న ఉద‌యం 8.15 గంట‌ల‌కు బ‌య‌లుదేరి, మ‌రుస‌టి రోజు రాత్రి 10.35 గంట‌ల‌కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్ – బిలాస్‌పూర్ (08820) ఎక్స్‌ప్రెస్ జూన్ 14 వ తేదీ రాత్రి 9.30 గంట‌ల‌కు బ‌య‌లుదేరి, మ‌రుస‌టి రోజు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు బిలాస్‌పూర్ చేరుకుంటుంది.

Leave A Reply

Your email address will not be published.