ts: ఇవాళ, రేపు ఓ మోస్తరు వర్షాలు!
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో సోమవారం, మంగళవారం అక్కడక్కడా ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావారణ కేంద్రం తెలిపింది. ఎంపి, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల మీదుగా బంగాళాఖాతం వరకు 1500 మీ. ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రెండు రోజుల పాటు ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. నిన్న (ఆదివారం) మధ్యాహ్నం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. నిజాంబాద్‌లో 3.6, కోహెడలో 4, మల్యాల 4, టేక్మాలు 4, అశ్వాపురం 3.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది.