TS: ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్. ఇవాళ (మంగళవారం) ఇంటర్ మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఇంటర్ పరీక్షలను సుమారు 9 లక్షల మంది విద్యార్థులు రాసినట్లు మంత్రి తెలిపారు. ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం ఫలితాలు వెలుడిన 15 రోజు్లోనే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ ఇప్పటికే ప్రకటించారు.
ఇంటర్ఫస్ట్ ఇయర్‌కు మొత్తం 464892 మంది విద్యార్థులు హాజరైతే 294379 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 63.32 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో అమ్మాయిలు 72.3 శాతం కాగా, అబ్బాయిలు 54.24 శాతం మంది పాస్ అయ్యారు.
సెకండ్ ఇంటర్
ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో మొత్తం 67.96 శాతం పాసయ్యారు. వీరిలో అమ్మాయిలు 75.28 శాతం, అబ్బాయిలు 59.21 శాతం మంది ఉన్నారు. మెడ్చల్ జిల్లా 78 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో ఉండగా.. మెదక్ జిల్లా 47 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో ఉంది.
ఈ ఫలితాలను https://results.cgg.gov.in/, https://examresults.ts.nic.in/, https://tsbie.cgg.gov.in/ వెబ్సైట్లలో చూడవచ్చని అధికారులు తెలిపారు.