8 నెలల తర్వాత రాజ్‌భవన్‌కు సిఎం కెసిఆర్
గవర్నర్, సిఎంల మధ్య చిరునవ్వులు
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఎనిమిది నెలల తర్వాత మంగళవారం రాజ్‌భవన్‌కు వెళ్లారు. 2021 అక్టోబరు 11న అప్పటి సిజె జస్టిస్ సతీష్ చంద్రశర్మ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లారు. మళ్లీ 8 నెలల తర్వాత ఇవాళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమం అనంతరం గవర్నర్ ఇచ్చిన తేనేటి విందులో ముఖ్య మంత్రి కెసిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ గవర్నర్‌తో ముచ్చటించారు. అక్కడే ఉన్న కిషన్‌రెడ్డి తో కూడా సిఎం మాట్లాడారు. ఈ సమయంలో గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కెసిఆర్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మధ్య నవ్వులు విరిశాయి. గవర్నర్, సిఎం మధ్య సమావేశం సాఫీగా, సహృద్భావ వాతావరణంలో జరిగిందని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి.
కాగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణస్వీకార కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు నిరంజన్‌రెడ్డి, సత్యవతిరాథోడ్ తదితరులు హాజరయ్యారు.