డిగ్రీ ప్ర‌వేశాల కోసం.. దోస్త్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌

హైదరాబాద్ (CLiC2NEWS): ఇంట‌ర్ ఉత్తీర్ణులై డిగ్రీలో చేరే విద్యార్థ‌లు కోసం దోస్త్ నోటిఫికేష‌న్ బుధ‌వారం విడుద‌లైంది. రాష్ట్రంలో ఇంట‌ర్ ప‌రీక్షా ఫ‌లితాలు వెలువ‌డిన విష‌యం తెలిసిన‌దే. ఇంట‌ర్ త‌ర్వాత డిగ్రీ చ‌ద‌వాల‌నుకునే విద్యార్థుల‌కు డిగ్రీ ఆన్‌లైన్ స‌ర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేష‌న్ ఉన్న‌త విద్యామండ‌లి కార్యాల‌య‌లో విడుద‌ల చేశారు. రాష్ట్రంలోని ఉస్మానియా, కాక‌తీయ‌, తెలంగాణ‌, పాల‌మూరు, మ‌హాత్మ‌గాంధీ, శాత‌వాహ‌న విశ్వ‌విద్యాల‌యాల ప‌రిధిలోని 1,060 కళాశాలల్లో బిఎ, బికాం, బిఎస్పి త‌దిత‌ర డిగ్రీ కోర్సుల్లో సుమారు 4,25,000 సీట్ల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. మూడు లేదా నాలుగు విడ‌త‌ల్లో డిగ్రీ సీట్ల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. దోస్త్ వెబ్‌సైట్‌, టిఎస్ యాప్ ఫోలియో లేదా యూనివ‌ర్సిటీలు, ప్ర‌భుత్వం డిగ్రీ కాలేజీల్లోని స‌హాయ కేంద్రాల ద్వారా విద్యార్థులు రిజిస్ట్రేష‌న్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. వ‌చ్చే నెల 1వ తేదీ నుండి 30 వ‌ర‌కు మొద‌టి విడ‌త దోస్త్ రిజిస్ట్రేష‌న్ చేప‌డ‌తామ‌ని అధికారులు వెల్ల‌డించారు. జులై 6వ తేదీనుండి 30 వ‌ర‌కు వెబ్ ఆప్ష‌న్లు న‌మోదుకు అవ‌కాశం క‌ల్పించారు.

Leave A Reply

Your email address will not be published.