ఎంపి సంతోష్ కుమార్‌కు సాలుమార‌ద తిమ్మ‌క్క నేష‌న‌ల్ గ్రీన్ అవార్డ్‌

బెంగ‌ళూరు (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర రాజ్య‌స‌భ్యులు జోగినిప‌ల్లి సంతోష్‌కుమార్‌ను సాలుమార‌ద తిమ్మ‌క్క నేష‌న‌ల్ గ్రీన్ అవార్డు వ‌రించింది. బెంగ‌ళూరులోని వ‌సంత్ న‌గ‌ర్ డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్ స్టేడియంలో తిమ్మ‌క్క 111 జ‌న్మ‌దిన వేడుక‌లు అట్ట‌హాసంగా జ‌రిగాయి. ఈ సందర్భంగా తిమ్మ‌క్క చేతుల మీదుగా అవార్డును ఎంపి సంతోష్ కుమార్ అందుకున్నారు.

సాలుమార‌ద తిమ్మ‌క్క ఇంట‌ర్నేష‌న‌ల్ ఫౌండేష‌న్‌, శ్రీ సిద్ధార్థ ఎడ్యుకేష‌న‌ల్ సొసైటి కలిసి 2020 సంవ‌త్స‌రానికి గాను దేశ‌లంలో అత్యుత్త‌మ సామ‌జిక సేవ‌లు అందిస్తున్న‌వారికి అవార్డుల‌ను అంద‌జేసింది. ప్ర‌కృతి ప‌రిర‌క్ష‌ణ విభాగంలో ఎంపి సంతోష్ కుమార్ అవార్డ్ అందుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.