పదవీవిరమణ చేస్తున్న హెడ్ కానిస్టేబుల్‌కు అత్మీయ వీడ్కోలు
రామగుండం (CLiC2NEWS): గత 33 సంవత్సరాల కాలం పోలీసు శాఖలో అమూల్యమైన సేవలు అందించి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఎం.డి ఖలీముద్దీన్ పదవీవిరమణ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి, అడిషనల్ డిసిపి అడ్మిన్ అఖిల్ మహజన్ పూలమాలలు వేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు.
సిపి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ .. పదవీ విరమణ ప్రతి ఒక ఉద్యోగి కి తప్పదని, ఉద్యోగంలో ఉన్నపుడు చేసిన సేవలే ఉద్యోగణాంతరం కూడా వ్యక్తి గుర్తుండేలా మంచి పేరు ప్రఖ్యాతలు తెస్తాయని అన్నారు. “ పోలీసు రిటైర్ మెంట్ కేవలం తన వృత్తికే, కాని తన వ్యక్తిత్వానికి కాదు” అని అన్నారు. విధి నిర్వహణలో పగలనక, రాత్రనక, పండగల సమయంలో భార్యా, పిల్లలకు దూరంగా ఉండి డ్యూటీలు చేసినారు. పదవి విరమణ చేసిన మీరు ఇకపై కుటుంబ సభ్యులతో అనందంగా వారి భావి జీవితం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ అఖిల్ మహాజన్, ఏఅర్ ఎసిపి సుందర్ రావు, ఆర్ఐ లు మధుకర్, శ్రీధర్, అనిల్, విష్ణు ప్రసాద్, సిసి శ్రవణ్ కుమార్ ,రామగుండం పోలిస్ కమీషనరేట్ పోలిస్ సంఘము అధ్యక్షులు బోర్లాకుంట పోచలింగం, సభ్యులు రాజు, కుటుంబ సభ్యులు పాల్గోన్నారు.