జులై 5న బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ క‌ల్యాణం.. సిఎం కెసిఆర్‌కు ఆహ్వానం

హైద‌రాబాద్ (CLiC2NEWS): న‌గ‌రంలోని బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ క‌ల్యాణ మ‌హోత్స‌వం ఈనెల 5వ తేదీన నిర్వహించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో దేవ‌స్థానం ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు.. ముఖ్య‌మంత్రి కెసిఆర్‌ను ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో క‌లిసి అమ్మ‌వారి క‌ల్యాణ మ‌హోత్స‌వానికి ఆహ్వానించారు. సిఎం కెసిఆర్‌ను ఆల‌య పండితులు వేద మంత్రాల‌తో ఆశీర్వ‌చ‌నం అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో దేవాల‌య అర్చ‌కులు, స‌హాయ క‌మిష‌న‌ర్‌, కార్య‌నిర్వ‌హ‌ణాధికారి, ఆల‌య ధ‌ర్మ‌క‌ర్త మండ‌లి స‌భ్యులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.