Hyd: నేడు ప‌లు ప్రాంతాల్లో నీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం

హైద‌రాబాద్ (CLiC2NEWS): గ్రేట‌ర్ ప‌రిధిలో గురువారం ప‌లు చోట్ల మంచినీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం ఏర్ప‌డ‌నుంద‌ని జ‌ల‌మండ‌లి అధికారులు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. కృష్ణా డ్రింకింగ్ వాట‌ర్ స‌ప్ల‌య్ ప్రాజెక్ట్ ఫేస్ – 3కి సంబంధించిన రింగ్ మెయిన్ – 2లో 500 ఎంఎం డ‌యా స్లూయిస్ వాల్వ్ మ‌రమ్మ‌త్తు ప‌నుల‌ను అత్య‌వ‌స‌రంగా చేప‌ట్టాల్సి ఉంది. బుద్ధాన‌గ‌ర్ స‌మీపంలోని మ‌ల్లికార్జున‌న‌గ‌ర్ క‌మాన్ వ‌ద్ద ఈ ప‌నులు జ‌ర‌గ‌నున్నాయ‌ని జల‌మండ‌లి ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది..

ఈ నేప‌థ్యంలో అల్వాల్, సైనిక్‌పురి, మౌలాలి రిజ‌ర్వాయ‌ర్ల ప‌రిధిలోని ప్రాంతాల్లో ఇవాళ (మంగ‌ళ‌వారం) మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి రాత్రి ప‌ది గంట‌ల వ‌ర‌కు మొత్తం 10 గంట‌ల పాటు మంచినీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం క‌లుగుతుందని.. నీటిని పొదుపుగా వాడుకోగ‌ల‌ర‌ని జ‌ల‌మండ‌లి ప్ర‌క‌ట‌న‌లో కోరింది.

Leave A Reply

Your email address will not be published.