లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన పోలీసులు
రామగుండం పోలీస్ కమిషనరేట్ (CLiC2NEWS): రెవెన్యూ అధికారులతో సమన్వయంతో జన్నారం పోలీసులు బూడిగజంగాల కాలనీ లోని కుటుంబాలను జన్నారం హై స్కూల్ కు తరలించారు. మంగళవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల జోన్ జన్నారం పోలీస్స్టేషన్ పరిధిలోని బుడిగజంగాల కాలనీ లో గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వలన వరద నీరు కారణంగా వారి ఇండ్లు లోనికి నీరు చేరి కూలిపోయి ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. దీంతో జన్నారం ఎస్ ఐ సతీష్, స్థానిక MRO లు కాలనీ సందర్శించి ఆ ఇంటిలలోని సభ్యులతో మాట్లాడి వారి తరలింపునకు ఏర్పాటు చేశారు. రెవెన్యూ అధికారుల సమన్వయంతో వారిని జన్నారం ఉన్నత పాఠశాలకు తరలించారు.
