భారత్‌కు ఒకే రోజు నాలుగు స్వర్ణాలు..
బర్మింగ్ హామ్ (CLiC2NEWS): కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు ఒకే రోజు నాలుగు స్వర్ణాలు సొంతమయ్యాయి. బాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో పివి సింధు పసిడి సాధించిన వియయం తెలిసినదే. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ స్వర్ణం సాధించాడు. మలేషియాకు చెందిన జె యంగ్ ఎన్జీని 19-21,21-9, 21-16 తేడాతో ఓడించాడు. బాడ్మింటన్ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడి మూడో పసిడిని సొంతం చేసుకున్నారు. ఇంగ్లాండ్‌కు చెందిన ఆటగాళ్లపై 21-15, 21-13 తేడాతో విజయం సాధించారు. కామన్వెల్త్ క్రీడల్లో బాడ్మింటన్ విభాగంలో మూడు స్వర్ణాలు సాధించి భారత్‌కు అతిగొప్ప రోజుగా ఉంది.
పురుషుల టేబుల్ టెన్నిస్ ఫైనల్స్‌లో శరత్ కమల్ ఆచంట ఇంగ్లాండ్‌పై గెలుపొంది ఈ రోజు నాలుగో పసిడిని భారత్‌కు అందించాడు. శరత్ తుదిపోరులో 4-1 తేడాతో ప్రత్యర్థి లియామ్ పిచ్ఫోర్డ్ను ఓడించాడు. శరత్ 2006 కామన్వెల్త్ క్రీడల్లో మొదటిసారి స్వర్ణం సాధించాడు. మళ్లీ ఇప్పుడు మరోసారి పసిడి పట్టాడు.