రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులను విడుదల చేయండి: సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఢిల్లీ (CLiC2NEWS): మాజీ భారత ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషులను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో నళిని సహా దోషులందరూ విడుదల కానున్నారు. ఈ కేసులో పేరరివాళన్, రాబర్ట్ పయాస్, జయకుమార్, మురుగన్, శాంతన్ నళిని, రవిచంద్రన్ జీవిత ఖైదును అనుభవిస్తున్నారు. ఇతర కేసుల్లో వీరికి జైలు శిక్ష అవసరం లేకపోతో విడుదల చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. వీరిని విడుదల చేయడానికి తమిళనాడు ప్రభుత్వం సుముఖత చూపినట్లు తెలుస్తోంది. దీంతో పాటు సోనియా గాంధీ కుటుంబం నుండి ఎటువంటి వ్యతిరేకత రాకపోవడంతో సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని..అందరి అభిప్రాయాలను స్వీకరించిన తర్వాతనే దోషుల విడుదల చేయాలని ఉత్తర్వులు ఇస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది.
ఈ ఏడాది మే 18న సుప్రీంకోర్టు ఎ.జి పేరరివాళన్‌ను విడుదల చేయాలని తీర్పునిచ్చింది. 1998లో రాజీవ్ గాంధీ హత్య కేసులో ఏడుగురిని దోషులుగా నిర్థారించి వారికి మరణశిక్షను విధించారు. తర్వాతి ఏడాది వీరి మరణశిక్షను సుప్రీంకోర్టు నిలిపివేసింది. 2014లో పేరరివాళన్ సహా మురుగన్, నళిని, శాంతన్ మరణశిక్షను సుప్రీంకోర్టు జీవితఖైదుగా తగ్గించింది.
Hello mates, its impressive piece of writing concerning
tutoringand completely defined, keep it up all the time.
hello!,I love your writing very much! share we keep up a correspondence more about your post on AOL?
I need an expert in this house to resolve my problem.
Maybe that is you! Taking a look ahead to peer you.