మంటల్లో కాలిపోయిన రూ. 8లక్షల నగదు..50 పట్టు చీరలు!
అనంతపురం (CLiC2NEWS): ఓ బట్టల దుకాణంలో మంటలు వ్యాపించి సుమారు రూ. 8లక్షల నగదు , 50వరకు పట్టు చీరలు దగ్ధమయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉరవకొండలోని స్థానిక 10వ వార్డులో చేనేత కార్మికుడు నివాసముంటున్నాడు. ఆయన ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులతో కలిసి బయటకు వెళ్లాడు. ఆ సమయంలో విద్యత్ షార్ట్ సర్యూట్ వలన మంటలు అలుముకున్నాయి. స్థానికులు గమనించి సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థాలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే ఇంట్లో ఉన్న రూ. 8లక్షల నగదు, పట్టు చీరలు, ఇంట్లోని ఇతర సామాగ్రి మంటల్లో కాలిపోయాయి. వ్యాపారి మగ్గం కూడా కాలిపోపోగా.. ప్లాట్ కొనుగోలు కోసం నగదును ఇంట్లో ఉంచినట్లు బాధితుడు తెలిపారు. మొత్తం సుమారు రూ.20 లక్షల వరకు నష్టం వాటినట్లు అగ్నిమాపక అధికారులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
