తెలుగు రాష్ట్రాల్లోని ఓట‌ర్ల తుది జాబితా విడుద‌ల‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణలోని ఓట‌ర్ల తుది జాబితాను కేంద్ర‌ ఎన్నిక‌ల సంఘం విడుద‌ల చేసింది. ప్ర‌తి సంవ‌త్స‌ర‌ ఓటర్ల జాబితా స‌వ‌ర‌ణ తర్వాత జ‌న‌వ‌రి నెల‌లో కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఓటర్ల జాబితాను ప్ర‌క‌టిస్తుంది. దీనిలో భాగంగా రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ గురువారం ఓట‌ర్ల జాబితాను విడుద‌ల చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఓట‌ర్ల సంఖ్య 2,99,92,941 కాగా.. ఎపిలో మొత్తం ఓట‌ర్ల సంఖ్య 3,99,84,868కి చేరింది. ఇక హైద‌రాబాద్ జిల్లాలో ఓట‌ర్ల సంఖ్య 42,15,456కి చేరింది. రంగారెడ్డి జిల్లాలో ఓట‌ర్ల సంఖ్య 31,08,068కి చేరింది. అత్య‌ధికంగా శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో 6,44,072 మంది ఓటర్ల ఉన్న‌ట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ఇక‌ భ‌ద్రాచ‌లం 1,42,813 మంది ఓటర్ల‌తో అత్య‌ల్ప ఓట‌ర్లు ఉన్న నియోజ‌క‌వ‌ర్గంగా నిలిచింది.

ఎపిలో మొత్తం 3,99,84,868 మంది ఓట‌ర్లు ఉన్నారు. వీరిలో మ‌హిళా ఓట‌ర్లు 2,02,19,104 మంది ఉండ‌గా.. పురుషులు 2,01,32,271 మంది ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.