ములాయం సింగ్‌ యాదవ్‌కు కరోనా పాజిటివ్

లక్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ములాయం ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ స్పందించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో ములాయంకు చికిత్సనందిస్తున్నట్లు అఖిలేష్ తెలిపారు. ములాయంకు ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.