ఎర్రవెల్లికి బయలుదేరిన మాజి ఎంపి మాలోత్ కవిత అరెస్టు
నెల్లికుదురు (CLiC2NEWS): BRS అధినేత కేసీఆర్, ఎర్రవెల్లి నివాసం పై కాంగ్రెస్ నాయకులు దాడికి పన్నాగం పన్నారని, పోలీసులను అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలు చేస్తున్నారని మహబూబాబాద్ మాజి పార్లమెంట్ సభ్యులు మాలోత్ కవిత ఆరోపించారు. ఎర్రవల్లికి బయలుదేరిన ఆమెను పోలీసులు అడ్డుకొని, అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు. మాలోత్ కవితతో పాటు మాజి ఎమ్ ఎల్ ఎ శంకర్ నాయక్ ను మార్గ మధ్యంలో పోలీసులు అరెస్టు చేశారు. యువజన విభాగం నాయకులు యల్లా మురళీధర్ రెడ్డి , లునావత్ అశోక్ నాయక్, నాయని రంజిత్, జన్నే నవీన్, సంగెం భరత్ వర్మ తదితరులు ఉన్నారు.
Also Read: మహబూబాబాద్: కలెక్టర్ కార్యాలయం ఎదుట BRS నాయకుల నిరసనలు