AP: సుళ్లూరుపేట, చుట్టుపక్కల గ్రామాల్లో విద్యుత్ కోతలు…….

సూళ్లూరుపేట (CLiC2NEWS): తిరుప‌తి జిల్లా సూళ్లూరుపేటలో వేళాపాళ‌ లేకుండా క‌రెంటు కట్ చేయ‌డంతో సూళ్లూరు పేట మ‌రియు చుట్టుప‌క్క‌ల గ్రామాల్లో ని ప్ర‌జ‌లు నానా ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. రాత్రి స‌మ‌యంలో అయితే క‌రెంటు ఎప్పుడు పోతుందో తెలియ‌క ప్ర‌జ‌లు బిక్కుబిక్కుమంటున్నారు. రాత్రి స‌మ‌యంలో కారెంట్ లేక పోవ‌డంతో చ‌దువుకునే పిల్ల‌లు చాలా ఇబ్బందులు ప‌డుతున్నారు. విద్యుత్ కోత‌లు ఎందుకు జ‌రుగుతున్నాయ‌ని కానీ.. క‌రెంటు కోత‌లు జ‌రుగుతాయ‌ని ముందస్తు స‌మాచారం కూడా లేకుండా క‌రెంట్ క‌ట్ చేస్తున్నార‌ని ప్ర‌జ‌లు వాపోతున్నారు. ఇంత జ‌రుగుతున్నా ఏ అధికారి కూడా త‌మ గోడు ప‌ట్టించుకోవ‌టం లేదంటున్నారు. సంబంధిత అధికారులు విద్యుత్ కోత‌ల‌పై దృష్టి సారించాల‌ని ప్ర‌జ‌లు కోరుతున్నారు.

 

Also Read: మానసిక వికలాంగురాలిపై లైంగిక దాడి.. నిందితుడికి 10 ఏళ్లు జైలుశిక్ష

Leave A Reply

Your email address will not be published.