Telangana: గిరిజన గురుకులాల్లో కోచ్‌ల నియామకాలకు నోటిఫికేషన్
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలోని గిరిజన గురుకుల పాఠశాలల్లో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో కోచ్‌ల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలోని పాఠశాలలో, కొత్త గూడెం జిల్లాలోని కిన్నెరసాని, కాచనపల్లి పాఠశాలల్లో ఖాళీగా కబడ్డీ, వాలీబాల్ హ్యాండ్ బాల్ కోచ్‌లను 2022-23 సంవత్సరానికి గాను ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఎన్ ఎస్ ఎన్ ఐ ఎస్ డిప్లొమా కోర్సు ఉత్తీర్ణులైనవారు అర్హులు. దరఖాస్తుదారులు తమ రెజ్యూమ్‌ను జతచేసి మెయిల్ చేయాల్సి ఉంటుంది. లేదా.. అకడిమిక్ సెల్, కమిషనర్ కార్యాలయం, గిరిజన సంక్షేమ శాఖ, డిఎస్ ఎస్ భవన్, మాసబ్‌టాంక్, హైదరాబాద్ నందు అందజేయాల్సి ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతున్నారు. దరఖాస్తునకు చివరితేదీ జనవరి 30. దరఖాస్తులను tstribalwelfare.egg.gove.in వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు 9908550250, 9247267050 నెంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు.